Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వీడిన మోడల్ మానసి హత్య మిస్టరీ: కోరిక తీర్చలేదని కొట్టి.. ఉరివేసి చంపేశాడు!

  • ట్రావెల్ బ్యాగ్ లో దొరికిన మోడల్‌ మానసి దీక్షిత్‌ శవం 
  • హత్య చేసింది హైదరాబాద్‌కు చెందిన ముజమ్మిల్‌ సయ్యద్‌
  • నిందితుడిని పట్టించిన సీసీ కెమెరా పుటేజీ
స్నేహం నటించాడు. సరదాగా ఇంటికి రమ్మన్నాడు. నమ్మి ఇంటికి వచ్చిన ఆమెను కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. ససేమిరా అనడంతో కోపం ఆపుకోలేక స్టూల్ తో తలపై బలంగా కొట్టాడు. స్పృహతప్పి పడిపోయిన ఆమె మెడకు తాడు చుట్టి చంపేశాడు. శవాన్ని తీసుకువెళ్లి పొదల్లో పారేసిన సమయంలో రికార్డయిన సీసీ టీవీ పుటేజీతో పోలీసులకు చిక్కాడు. రాజస్థాన్‌ రాష్ట్రం కోట నగరానికి చెందిన ప్రముఖ మోడల్‌ మానసి దీక్షిత్‌ (20) హత్య కేసు మిస్టరీని పోలీసు ఛేదించారు.

 పోలీసు కథనం మేరకు... మానసి ఆరు నెలల క్రితం ముంబై నగరానికి వచ్చింది. మిల్లత్‌నగర్‌లో నివాసం ఉండేది. హైదరాబాద్‌ నగరానికి చెందిన ముజమ్మిల్‌ సయ్యద్‌ ముంబైలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అంథేరిలో నివాసం ఉంటున్న ఇతనికి మానసి దీక్షిత్‌తో స్నేహం ఏర్పడింది. ఆ చనువుతో మానసిని ఓసారి సయ్యద్‌ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమె తిరస్కరించడంతో తలపై కొట్టాడు.

స్పృహ కోల్పోయిన ఆమె ముఖంపై నీళ్లు చల్లగా కొద్దిగా తేరుకుంది. అయితే ఆమె లేస్తే తనపై ఎక్కడ ఫిర్యాదు చేస్తుందో అని భయపడిన సయ్యద్‌ ఆమె మెడకు తాడుచుట్టి హత్య చేశాడు. అనంతరం శవాన్ని ట్రావెల్‌ బ్యాగులో పెట్టి ఆ బ్యాగును మలాద్‌ ప్రాంతంలోని మైండ్‌ స్పేస్‌ వద్ద పొదల్లో పడేశాడు. బ్యాగు నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా మానసి దీక్షిత్‌ మృతదేహం బయటపడడంతో ఆశ్చర్యపోవడం వారి వంతయింది.

కేసు విచారించిన పోలీసులు ఆ రోడ్డులోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. అందులో సయ్యద్‌ క్యాబ్‌లో వచ్చి మలాద్‌ ప్రాంతంలోని తుప్పల్లో ఓ బ్యాగు పడేయడం రికార్డు అయి ఉండడంతో అనుమానంతో క్యాబ్‌ డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతనిచ్చిన సమాచారంతో సయ్యద్‌ ఈ హత్య చేసినట్లు తేల్చారు.
model mansi deekshit
dead mistery chased

More Telugu News